- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
H-1B Visa: హెచ్-1బీ ఫీజు నుంచి వైద్యులకు మినహాయింపు.. వైట్ హౌస్ కీలక నిర్ణయం !
హెచ్-1బీ వీసాలపై ఇటీవల అమెరికా విధించిన లక్ష డాలర్ల రుసుము నుంచి వైద్యులను మినహాయించనున్నట్టు తెలుస్తోంది.

దిశ, నేషనల్ బ్యూరో: హెచ్-1బీ వీసాలపై ఇటీవల అమెరికా విధించిన లక్ష డాలర్ల రుసుము నుంచి వైద్యులను మినహాయించనున్నట్టు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరతపై యూఎస్ వైద్య సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునేందుకు ట్రంప్ సిద్ధమైనట్టు సమాచారం. ఈ మేరకు వైట్ హౌస్ ప్రతినిధి టేలర్ రోజర్స్ ఈ విషయంపై హింట్ ఇచ్చారు. వీసా రుసుములపై అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వు వైద్యులు, వైద్య సిబ్బందికి కూడా మినహాయింపును అందించనున్నట్టు తెలిపారు. భారీ వీసా ఫీజుల వల్ల విదేశీ వైద్యులు అమెరికాకు వచ్చే అవకాశం ఉండబోదని, కాబట్టి ఇప్పటికే వైద్యుల కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో పరిస్థితి మరింత క్షిణిస్తుందని అక్కడి వైద్య నిపుణులు హెచ్చరించారు. దీంతో వైద్య రంగంపై వైట్ హౌస్ యూ టర్న్ తీసుకున్నట్టు సమాచారం. దీనిపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉందని పలు కథనాలు పేర్కొన్నాయి.
కాగా, హెచ్1బీ వీసా అనేది అమెరికా కంపెనీలు విదేశాలల్లో మంచి స్కిల్స్ కలిగిన యువతను తమ సంస్థల్లో నియమించుకోవడానికి అనుమతించేందుకు దోహదపడుతుంది. ఈ వీసా మూడేళ్ల పాటు వ్యాలిడిటీ కలిగి ఉండగా దానిని మరో మూడేళ్లు పొడిగించే అవకాశం ఉంటుంది. అయితే ఈ వీసాపై రుసుమును అమెరికా ప్రభుత్వం ఇటీవల భారీగా పెంచింది. దీంతో పలువురు ఆందోళన వ్యక్తం చేయగా కొత్త దరఖాస్తులపైనే రుసుము విధించనున్నట్టు స్పష్టం చేసింది. తాజాగా దాని నుంచి వైద్యులను మినహాయించేందుకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.






