Gyanesh kumar: ఓటర్ల జాబితా తయారీ ఇండియాలోనే కఠినం.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్

by B.Srinivas |

ఎన్నికల్లో ఓటర్ లిస్టును ఉపయోగించుకున్నారని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Gyanesh kumar: ఓటర్ల జాబితా తయారీ ఇండియాలోనే కఠినం.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల్లో రిగ్గింగ్ చేయడానికి ఓటర్ లిస్టును ఉపయోగించుకున్నారని కాంగ్రెస్ పార్టీ సహా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ (Gyanesh kumar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితా తయారీ ప్రపంచంలోని ఇతర దేశాల కంటే ఇండియాలోనే కఠినంగా ఉంటుందని, ఈ ప్రక్రియ అంతా అత్యంత పారద్శకంగా జరుగుతుందని నొక్కి చెప్పారు. ప్రతి ఏటా ఓటర్ల జాబితాలో సవరణలు ఉంటాయని, ఎన్నికలకు ముందు ఈ డేటాను పొలిటికల్ పార్టీ (Political party) లతో పంచుకుంటామని తెలిపారు. స్వీడన్‌లో జరిగిన స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో ఆయన ప్రసంగించారు.1960 నుంచి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఓటర్ల జాబితాలను పంచుకుంటున్నామని, క్లెయిమ్‌లు, అభ్యంతరాలు, అప్పీళ్లకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు.

మొత్తం ఎన్నికల ప్రక్రియను రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, పోలీసులు, వ్యయ పరిశీలకులు, మీడియా విభాగాలు నిశితంగా పర్యవేక్షిస్తాయన్నారు. వారు వివిధ దశల్లో ఆడిటర్ల మాదిరిగానే వ్యవహరిస్తారన్నారు. ఎన్నికల నిర్వహణ టైంలో పోలింగ్ సిబ్బంది, పోలీస్ దళాలు, పరిశీలకులు, రాజకీయ పార్టీ ఏజెంట్లతో కలిపి 20 మిలియన్లకు పైగా సిబ్బందితో ఎన్నికల కమిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా అవతరించిందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ఖచ్చితత్వం, సమగ్రతను మరింత బలోపేతం చేస్తామన్నారు.

Next Story