- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమానాస్పదంగా యువకుడు మృతి.. సె*క్స్ మెడిసిన్ ఓవర్ డోసే కారణమా?
గురుగ్రామ్ లో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని రూమ్ లో దొరికిన మెడిసిన్ పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: గురుగ్రామ్ లో తీవ్ర విషాద ఘటన జరిగింది. సెక్టార్ 53 ప్రాంతంలోని ఒక పేయింగ్ గెస్ట్ ఫ్లాట్‌లో నివాసముంటున్న 29 ఏళ్ల యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ప్రాథమిక విచారణలో లైంగిక సామర్థ్యాన్ని పెంచే మందులు (Sexual Enhancement Drugs) అతిగా వాడటం వల్లే అతను మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఫోన్ ఎత్తకపోవడంతో వెలుగులోకి..
మృతుడిని నాగ్‌పూర్‌కు చెందిన రోహిత్ లాల్(29)గా గుర్తించారు. రోహిత్ ఢిల్లీలోని నౌరోజీ నగర్‌లో ఉన్న 'క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా' (QCI)లో పనిచేస్తూ, గురుగ్రామ్‌లోని ఒక పీజీలో అద్దెకు ఉంటున్నాడు. రోజూ తనతో పాటు ఆఫీసుకి వెళ్లే తోటి ఉద్యోగి గురువారం ఉదయం రోహిత్‌కు ఫోన్ చేయగా అతను స్పందించలేదు. గది వద్దకు వెళ్లి తలుపు కొట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చిన అతను.. పోలీసులకు సమాచారం అందించాడు.
గదిలో మెడిసిన్ ప్యాకెట్లు..
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగలగొట్టి చూడగా, రోహిత్ మంచంపై విగతజీవిగా పడి ఉన్నాడు. గదిని సోదా చేయగా కొన్ని మందుల కవర్లు, హెల్త్ సప్లిమెంట్స్ లభ్యమయ్యాయి. రోహిత్ త్వరలోనే తన కాబోయే భార్య రాక కోసం ఎదురుచూస్తున్నాడని పోలీసుల విచారణలో తెలిసింది. ఈ క్రమంలోనే అతను లైంగిక సామర్థ్యం పెంచే మందులను మోతాదుకు మించి వాడి ఉండవచ్చని, దానివల్ల గుండెపోటు వచ్చి మరణించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. సెక్టార్ 53 పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్ సతేందర్ రావల్ మాట్లాడుతూ.. "ఘటనా స్థలంలో దొరికిన మందులను, మృతుడి విసెరా నమూనాలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL)కి పంపాము. రిపోర్ట్ వచ్చిన తర్వాతే మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయి. ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం" అని తెలిపారు. శుక్రవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.






