Gurugram: కాలుష్య నివారణకు 'కృత్రిమ వర్షం'

by S Gopi |
Gurugram: కాలుష్య నివారణకు కృత్రిమ వర్షం
X

దిశ, నేషనల్ బ్యూరో: గురుగ్రామ్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) చాలా పేలవమైన కేటగిరీలో ఉండటంతో, నగరంలోని ఒక హౌసింగ్ కాంప్లెక్స్ వారు వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ప్రత్యేకమైన పద్ధతిని ఎంచుకున్నారు. సెక్టార్ 82లోని డీఎల్ఎఫ్ ప్రైమస్ కాంప్లెక్స్‌కు చెందిన యాజమాన్యం స్ప్రింక్లర్‌లు, నీటి పైపులను ఉపయోగించి 'కృత్రిమ వర్షాన్ని ' సృష్టించింది. ఇది దుమ్ము, రేణువులను నియంత్రించడానికి అగ్నిమాపక కార్యకలాపాలలో సహాయపడుతుంది. దీనికి సంబంధించి 32 అంతస్తుల ఎత్తులో ఉన్న దాని టవర్ల నుంచి కాంప్లెక్స్‌పై వర్షం కురుస్తున్న వీడియో గురువారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కాంప్లెక్స్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్‌డబ్ల్యూఏ) అధ్యక్షుడు అచల్ యాదవ్ మాట్లాడుతూ కాలుష్యం తీవ్రమైన సమస్యగా మారుతోంది. దీన్ని ప్రభుత్వం మాత్రమే నియంత్రించలేదు. కాంప్లెక్స్‌లో నివాసం ఉంటున్న వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు తాము ఈ చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఏక్యూఐని బట్టి అవసరమైతే ప్రతిరోజూ కృత్రిమ వర్షం నిర్వహిస్తామన్నారు. అంతేకాకుండా హౌసింగ్ కాంప్లెక్స్ తీసుకున్న ఇతర చర్యలలో సైబర్ సిటీ, ఢిల్లీ, ఇతర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం కార్‌పూల్ సేవను ప్రారంభించామని తెలిపారు. ఇతర కాంప్లెక్స్‌లలో ఉంటున్నవారు కూడా ఈ సేవలను ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed