- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తహిశీల్దార్ కుర్చీలో కుక్క.. ప్రభుత్వాధికారి పని తనం.. దుమారం రేపుతున్న ఘటన
‘డాగ్ బాబు’ తహిశీల్దార్ కుర్చీలో కూర్చున్నాడంటూ ఆప్ నాయకుడు మనీష్ మిట్టల్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హర్యానా గురుగ్రామ్‌లో తహిశీల్దార్‌ను కలవడానికి కార్యాలయానికి వెళ్లగా.. ఆయన కుర్చీలో కుక్క ఉండటంతో ఫైర్ అయిన ఆయన..

దిశ, వెబ్ డెస్క్ : ‘డాగ్ బాబు’ తహిశీల్దార్ కుర్చీలో కూర్చున్నాడంటూ ఆప్ నాయకుడు మనీష్ మిట్టల్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హర్యానా గురుగ్రామ్‌లో తహిశీల్దార్‌ను కలవడానికి కార్యాలయానికి వెళ్లగా.. ఆయన కుర్చీలో కుక్క ఉండటంతో ఫైర్ అయిన ఆయన.. సైబర్ సిటీలోని ప్రభుత్వ కార్యాలయం పనితనం అంటూ వీడియో తీసి ఆన్‌లైన్‌లో పెట్టేశాడు. ఈ న్యూస్ ట్రెండింగ్‌లోకి రాగా ప్రభుత్వ కార్యాలయాల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపాన్ని ఎత్తి చూపుతుంది. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేందుకు ప్రజలు విసుక్కునేది ఇందుకేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక ఈ వీడియోపై కామెంట్స్ చేస్తున్న జనాలు.. ‘కుక్క రాజసం చూస్తున్నారా?’, ‘ గత జన్మలో ఈ కుక్క తహిశీల్దార్ అయి ఉంటుంది’, ‘నిజంగా నాకు జలస్‌గా ఉంది’ అంటూ స్పందిస్తున్నారు. ఇంకొందరు హర్యానా చీఫ్ మినిస్టర్, గురుగ్రామ్ మున్సిపల్ కార్పోరేషన్‌ను ట్యాగ్ చేసి.. సంఘటనను వివరించారు. మొత్తానికి ఎంటర్‌టైన్మెంట్‌తోపాటు పరిపాలనా లోపాలను ఎత్తి చూపుతున్న ఈ వీడియోకు రేటింగ్స్ కూడా ఇచ్చేస్తున్నారు నెటిజన్లు.






