- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుజరాత్‌లో 74 లక్షలు.. తమిళనాట 97 లక్షల ఓటర్లు డిలీట్
గుజరాత్‌లో 74 లక్షలు, తమిళనాట 97 లక్షల ఓటర్లు డిలీట్ అయ్యాయి. ఎస్ఐఆర్ తర్వాత డ్రాఫ్ట్ లిస్టును ఈసీ విడుదల చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్, తమిళనాడు ఎలక్టోరల్ డ్రాఫ్ట్ జాబితాను ఎన్నికల సంఘం (ఈసీ) విడుదల చేసింది. ఎస్ఐఆర్ అనంతరం విడుదల చేసిన ఈ జాబితాలో గుజరాత్‌లో 74 లక్షల ఓటర్ల పేర్లు డిలీట్ అయ్యాయి. అంతకుముందు గుజరాత్‌లో 5.08 కోట్ల ఓటర్లుండగా.. తాజా డ్రాఫ్ట్ లిస్టులో ఈ సంఖ్య 4.34 కోట్లకు చేరింది. సుదీర్ఘమైన పరిశీలన తర్వాతనే ఈ ఓట్లను తొలగించినట్లు గుజరాత్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ హరీత్ శుక్లా తెలిపారు.
అదే సమయంలో తమిళనాడు ఓటర్ల డ్రాఫ్ట్ జాబితా కూడా విడుదలైంది. ఎస్ఐఆర్ తర్వాత రాష్ట్రంలో సుమారు 97 లక్షల ఓట్లు డిలీట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 26.9 లక్షల మంది మరణించారని, 66.44 లక్షల మంది వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారని, సుమారు 3.39 లక్షల మంది రెండు మూడు చోట్ల రిజిస్టర్ అయి ఉన్నారని ఎన్నికల సంఘం తెలియజేసింది. దీంతో అంతకుముందు తమిళనాడులో 6.41 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. ఈ సంఖ్య 5.43 కోట్లకు దిగివచ్చింది. వీరిలో 2.66 కోట్ల మంది పురుషులు, 2.77 కోట్ల మంది మహిళలు, 7,191 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.






