- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇన్ఫార్మర్లకు రూ.11 కోట్లు రివార్డు.. అందించనున్న గుజరాత్ ప్రభుత్వం
గత మూడేళ్లుగా డ్రగ్స్ డీలర్ల సమాచారం అందించిన 970 మంది ఇన్ఫార్మర్లకు గుజరాత్ ప్రభుత్వం రూ.11కోట్లు రివార్డు ఇవ్వనుంది.

దిశ, నేషనల్ బ్యూరో : గత మూడేళ్లుగా డ్రగ్స్ డీలర్ల సమాచారం అందించిన 970 మంది ఇన్ఫార్మర్లకు గుజరాత్ ప్రభుత్వం రూ.11కోట్లు రివార్డు ఇవ్వనుంది. ఈ మేరకు శుక్రవారం ఉన్నతాధికారులు వివరాలు వెల్లడించారు. మొత్తం రివార్డులో 169 మందికి రూ.6,36,86,664 హోంశాఖ అందించనుంది. 737 మందికి రూ.5,13,40,680లను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇవ్వనుంది. 64 మందికి రూ.51,202లను డీజీపీ కమిటీ అందించనున్నట్లు అధికారులు తెలిపారు. 2021 నుంచి రూ.16,155 కోట్ల విలువైన 87,607 కిలోల డగ్స్ పట్టివేతలో ఈ ఇన్ఫార్మర్లు సహకరించారు. మొత్తం 2,500 మందిని డ్రగ్స్ అక్రమ రవాణా కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. 2021 నుంచి గుజరాత్ ఈ రివార్డు సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. సీజ్ చేసిన డ్రగ్స్ విలువలో 20శాతాన్ని ఇన్ఫార్మర్లకు అందిచాలని నిర్ణయించింది. పోలీసు ఆఫీసర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఒక్క కేసుకు రూ.2లక్షలు రివార్డుగా అందుకుంటారు. కెరీర్ మొత్తంలో రూ.20లక్షలు రివార్డు పొందేలా పరిమితం చేశారు. డ్రగ్స్ కేసులో ఆఫీసు వర్క్ చేసే వారికి రూ.2500ను రివార్డుగా అందించనున్నారు.






