- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సరిహద్దుల్లో ఉద్రిక్తత.. గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారతదేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఈనెల 15వ తేదీ వరకూ ఎలాంటి వేడుకల్లోనూ బాణసంచా, డ్రోన్లు వాడరాదని నిషేధం విధిస్తూ హోంమంత్రి హర్ష్ సంఘవి ఆదేశాలు జారీ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఈనెల 15వ తేదీ వరకూ ఎలాంటి వేడుకల్లోనూ బాణసంచా, డ్రోన్లు వాడరాదని నిషేధం విధిస్తూ హోంమంత్రి హర్ష్ సంఘవి ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకూ రాష్ట్రవ్యాప్తంగా బాణసంచాల విక్రయాలను నిలిపివేయాలని సూచించారు. ప్రతిఒక్కరూ ఈ ఆదేశాలను పాటించాలని, ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కాగా.. భారత్ - పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ (PM Modi) గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కు ఫోన్ చేసి మాట్లాడారు. సెన్సిటివ్ ప్రాంతాలైన కచ్, బనస్కంతా, పటాన్, జామ్ నగర్ లలో పౌరుల భద్రతకై రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు కేంద్ర రక్షణశాఖ అన్ని శాఖలతోనూ వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది. యుద్ధం పరిస్థితుల నేపథ్యంలో దేశంలో కనీస అవసరాల నిల్వలపై కూడా కేంద్రం ఆయా శాఖలతో చర్చిస్తోంది.






