- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉత్తమ ఉపాధ్యాయులకు శుభవార్త.. జీవితాంతం ఉచిత బస్సు ప్రయాణం
ఉత్తమ ఉపాధ్యాయులు గా ఎన్నికైన వారికి ప్రభుత్వం రాష్ట్రం మొత్తం ఉచిత బస్సు ప్రయాణం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: ఉత్తమ ఉపాధ్యాయులు గా ఎన్నికైన వారికి గుజరాత్ ప్రభుత్వం (Gujarat Govt) శుభవార్తను అందించింది. ఉత్తమ ఉపాధ్యాయులు (Best teachers)గా అవార్డు పొందిన రాష్ట్ర ఉపాధ్యాయులకు ఈ రోజు సాయంత్రం సీఎం భూపేంద్ర పటేల్ (CM Bhupendra Patel) బహుమతిని ప్రకటించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన ఉపాధ్యాయులు గుజరాత్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ST) యొక్క అన్ని బస్సు సర్వీసులలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా జీవితాంతం ఉచితంగా ప్రయాణించవచ్చని (Free travel for life) ప్రకటించారు. ఈ నిర్ణయం ఇప్పటివరకు రాష్ట్రంలో 957 మంది రాష్ట్ర-జాతీయ అవార్డు గెలుచుకున్న ఉపాధ్యాయులకు ప్రయోజనం చేకూరుస్తుంది. అలాగే భవిష్యత్తులో ఉత్తమ ఉపాధ్యాయులకు రాష్ట్ర-జాతీయ అవార్డులు పొందే ఉపాధ్యాయులు కూడా ఈ ప్రయోజనం పొందేందుకు అర్హులు అవుతారని సీఎంఓ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు పొందిన వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.






