- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Plane Crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మృతుల సంఖ్యను ప్రకటించిన గుజరాత్
జూన్ 12న అహ్మదాబాద్(Ahmadabad)లో జరిగిన విమాన ప్రమాదం(Air India Plane Crash)లో మృతుల సంఖ్యను నేడు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్ : జూన్ 12న అహ్మదాబాద్(Ahmadabad)లో జరిగిన విమాన ప్రమాదం(Air India Plane Crash)లో మృతుల సంఖ్యను నేడు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. అహ్మదాబాద్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి లండన్ గాట్విక్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171, బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్, టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే మేఘనీనగర్‌లోని బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో 275 మంది మరణించినట్టుగా ప్రభుత్వం పేర్కొంది. ప్రమాద సమయంలో విమానంలోని 242 మందిలో ప్రయాణికులు, సిబ్బంది సహ 241 మంది మరణించగా.. 34 మంది భవనంలోని విద్యార్థులు, స్థానికులని తెలిపింది. ఒక్క భారతీయ సంతతి బ్రిటిష్ పౌరుడు విశ్వాస్ కుమార్ రమేష్ (సీట్ 11A) మాత్రమే ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు.
మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణితోసహ 120 మంది పురుషులు, 124 మంది మహిళలు, 16 మంది చిన్నారులు ఉన్నారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా ఇప్పటి వరకు 256 మృతదేహాలను గుర్తించి, బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి, మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. టాటా గ్రూప్ మృతుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున పరిహారం, గాయపడినవారి వైద్య ఖర్చులను భరిస్తామని ప్రకటించింది.






