12 శాతం పెరిగిన జీఎస్టీ ఆదాయం.. జాతీయ సగటు కంటే అధికం

by Kema Shiva Kumar |

తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ ఆదాయం సెప్టెంబర్‌లో 12 శాతం పెరిగింది.

12 శాతం పెరిగిన జీఎస్టీ ఆదాయం.. జాతీయ సగటు కంటే అధికం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ ఆదాయం సెప్టెంబర్‌లో 12 శాతం పెరిగింది. జాతీయ సగటు 10 శాతం పెరుగుదల ఉండగా రాష్ట్ర జీఎస్టీ ఆదాయం రెండు శాతం ఆదనంగా ఉంది. సెప్టెంబర్‌లో రూ.5,103 కోట్ల ఆదాయం రాగా గత సంవత్సరం సెప్టెంబర్‌లో రూ.4,569 కోట్ల ఆదాయం వచ్చింది. దేశ వ్యాప్తంగా ఈ ఒక్క నెలలోనే జీఎస్టీ ద్వారా రూ.1,36,962 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా జీఎస్టీ అధికారులు వెల్లడించారు. జీఎస్టీ స్లాబులు తగ్గించిన నేపథ్యంలో ఆదాయం భారీగా పడిపోతుందని అంచనా వేసినా దాని ప్రభావం పెద్దగా లేదు. అయితే సెప్టెంబర్​ 22 నుంచే కొత్త స్లాబులు అమల్లోకి వచ్చినందున దీని ప్రభావం ఈ నెలలో పడుతుందని అధికారులు అంచనా విశ్లేషిస్తున్నారు. దేశంలో అత్యధికంగా జీఎస్టీ ద్వారా సెప్టెంబర్‌లో మహారాష్ట్రకు రూ.28,900 కోట్లు, కర్ణాటకకు రూ.14,204 కోట్లు, తమిళనాడుకు రూ.11,057 కోట్లు, గుజరాత్‌కు రూ.10,992 కోట్లు, ఉత్తర ప్రదేశ్‌కు రూ.9,086 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా జీఎస్టీ అధికారులు తెలిపారు.

Next Story