GST Council Meeting-2025: వినియోగదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న ధరలు!

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-16 04:02:30  IST  )

రెండు వారాల్లో జరగబోయే GST మండలి 56వ సమావేశం కోసం దేశ వ్యా్ప్తంగా వినియోగదారులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

GST Council Meeting-2025: వినియోగదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న ధరలు!
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు వారాల్లో జరగబోయే GST మండలి 56వ సమావేశం కోసం దేశ వ్యాప్తంగా వినియోగదారులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈసారి జరిగే భేటీలో అన్ని విభాగాల ఉత్పత్తుల జీఎస్‌టీ రేట్లను సమీక్షించి సవరిస్తారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఏసీలు, ట్రాక్టర్లు సహా పలు ఉత్పత్తులపై GSTని భారీగా తగ్గించే అవకాశం ఉంది. పూర్తి స్థాయి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లపై కూడా జీఎస్‌టీని రద్దు చేస్తారని తెలుస్తోంది. అయినా, బీమా కంపెనీలు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ముఖ్యంగా ట్రాక్టర్లపై జీఎస్టీ తగిస్టే అది వారికి భారీ ఊరటేనని చెప్పుకోవాలి. ప్రస్తుతం ట్రాక్టర్లు 12 శాతం జీఎస్‌టీ శ్లాబ్‌లో కొనసాగుతున్నాయి. ఈ శ్లాబ్‌నే పూర్తిగా ఎత్తేస్తారనే వార్తలు జాతీయ మీడియాలో వెలువడుతున్నాయి. అదే జరిగితే ట్రాక్టర్లు 5 శాతం శ్లాబ్‌లోకి చేరే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ట్రెమ్-4 (TREM-IV) ప్రమాణాలతో కూడిన ట్రాక్టర్లనే మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ఈ ప్రమాణాల ప్రకారం ట్రాక్టర్ల తయారీకి కంపెనీలు అదనపు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇందుకుగానూ జీఎస్‌టీ తగ్గింపుతో ఊరట పొందాలని కంపెనీలు భావిస్తున్నాయి.

అదేవిధంగా ఏసీలు ప్రస్తుతం 28 శాతం జీఎస్‌టీ శ్లాబ్‌లో కొనసాగుతున్నాయి. 2026 జనవరి నుంచి బీఈఈ (BEE) ప్రమాణాల ప్రకారం పనిచేసే ఏసీలు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రమాణాలతో కూడిన ఏసీల తయారీకి కంపెనీలకు సగటున 3 శాతం నుంచి 5 శాతం మేర ఖర్చు పెరుగనుంది. ఒకవేళ ఏసీలపై జీఎస్‌టీని కేంద్ర సర్కారు తగ్గిస్తే వోల్టాస్, హావెల్స్ లాంటి ఏసీల తయారీ కంపెనీలకు బిగ్ రిలీఫ్ లభించనుంది.

Next Story