విషాదం.. మూడు ముళ్లు వేయగానే నూరేళ్లు నిండిపోయాయ్..

by Naga Rani Yarlagadda |

వధువు మెడలో మూడు ముళ్లు వేసిన పాతికేళ్ల నవ వరుడికి నూరేళ్లూ నిండిపోయాయి. ఈ విషాద ఘటన కర్ణాటకలోని బాగలకోటె జిల్లా జమఖండి (Jamkhandi) పట్టణంలోని నందికేశ్వర్ కల్యాణ మంటపంలో (Nandikeshwar Kalyana Mantapam) జరిగింది.

విషాదం.. మూడు ముళ్లు వేయగానే నూరేళ్లు నిండిపోయాయ్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నో ఆశలు, ఇంకెన్నో కలలతో.. మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టీ పెట్టగానే ఆ జంటపై విధి వక్రించింది. వధువు మెడలో మూడు ముళ్లు వేసిన పాతికేళ్ల నవ వరుడికి నూరేళ్లూ నిండిపోయాయి. ఈ విషాద ఘటన కర్ణాటకలోని బాగలకోటె జిల్లా జమఖండి (Jamkhandi) పట్టణంలోని నందికేశ్వర్ కల్యాణ మంటపంలో (Nandikeshwar Kalyana Mantapam) జరిగింది. కుంబరహళ్లి గ్రామానికి చెందిన ప్రవీణ్, పూజ లకు శనివారం అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.

వివాహం జరిగిన కొద్దిసేపటికి రిసెప్షన్ ప్రారంభం కావాల్సి ఉండగా.. వరుడు ప్రవీణ్ వేదిక వద్ద కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అంతా షాక్ కు గురయ్యారు. తనకు ఛాతీలో విపరీతమైన నొప్పిగా ఉందని చెప్పడంతో సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రవీణ్ ను పరిశీలించిన వైద్యులు అప్పటికే ప్రాణం పోయినట్లు నిర్థారించారు. పెళ్లి జరిగిన నిమిషాల వ్యవధిలోనే వరుడు గుండెపోటు (Heart Attack)తో మరణించడంతో ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి.

Next Story