- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Helmet: రోడ్లపై కుప్పలు తెప్పలుగా నకిలీ హెల్మెంట్లు.. వాహనదారులకు కేంద్రం బిగ్ అలర్ట్
ద్విచక్ర వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ ఇచ్చింది.

దిశ, డైనమిక్ బ్యూరో: నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా తయారవుతున్న, అమ్ముడవుతున్న హెల్మెట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికెషన్ లేకుండా హెల్మెట్లను తయారు చేసే సంస్థలు, విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారుల వ్యవహారాల శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాంటర్డ్స్ (బీఐఎస్) మేరకు ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్‌లను మాత్రమే వినియోగించాలని వాహనాదారులకు సూచించింది. దేశవ్యాప్తంగా 21 కోట్లకు పైగా దిచక్ర వాహనాలు ఉన్నాయని.. రైడర్ల భద్రత అత్యంత ముఖ్యం అని కేంద్రం స్పష్టం చేసింది. మోటరు వాహన చట్టం -1988 ప్రకారం హెల్మెంట్ ధరించడం తప్పని సరి అని ఈ సందర్భంగా కేంద్రం గుర్తు చేసింది. రోడ్డు పక్కన విక్రయించే అనేక హెల్మెట్‌లకు బీఎస్ఐ సర్టిఫికేషన్ లేదని, దీనివల్ల రోడ్డు ప్రమాదాలలో అనేక మంది మరణాలు సంభవిస్తున్నాయని డిపార్ట్‌మెంట్ గుర్తించింది.
గత ఆర్థిక సంవత్సరంలో బీఐఎస్ స్టాండర్డ్ మార్క్ దుర్వినియోగం కోసం బీఐఎస్ 30కి పైగా సోదాలు నిర్వహించిందని వినియోగదారుల వ్యవహారాల శాఖ తన ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలో జరిపిన ఒక ఆపరేషన్‌లో గడువు ముగిసిన లేదా రద్దు చేయబడిన లైసెన్స్‌లు కలిగిన తొమ్మిది తయారీదారుల నుండి రెండు వేల 500కు పైగా నిబంధనలు పాటించని హెల్మెట్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. హెల్మెంట్ల నాణ్యతను నిర్దారించేందుకు 2021లోనే కేంద్ర ప్రభుత్వం ఒక క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ ను అమల్లోకి తీసుకువచ్చింది. దీని ప్రకారం బీఐఎస్ ప్రమానాలకు అనుగుణంగా ఉన్న ఐఎస్ఐ మార్క్ హెల్మెంట్ ను మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. జూన్ 2025 నాటికి భారతదేశం అంతటా 176 సంస్థలకు మాత్రమే నాణ్యమైన హెల్మెట్లు తయారు చేయడానికి బీఐఎస్ లైసెన్సులు ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది.






