PM Kisan : ‘పీఎం-కిసాన్’తో అక్రమ లబ్ధి.. అనర్హుల నుంచి రూ.335 కోట్ల రికవరీ

by Hajipasha |

దిశ, నేషనల్ బ్యూరో : ‘పీఎం-కిసాన్’(PM Kisan) స్కీం ద్వారా అక్రమంగా లబ్ధిపొందిన రైతులు, ఇతరత్రా పనులు చేసుకునే వారి నుంచి రూ.335 కోట్లను రికవర్ చేశామని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి భగీరథ్ చౌదరి వెల్లడించారు.

PM Kisan : ‘పీఎం-కిసాన్’తో అక్రమ లబ్ధి..  అనర్హుల నుంచి రూ.335 కోట్ల రికవరీ
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘పీఎం-కిసాన్’(PM Kisan) స్కీం ద్వారా అక్రమంగా లబ్ధిపొందిన రైతులు, ఇతరత్రా పనులు చేసుకునే వారి నుంచి రూ.335 కోట్లను రికవర్ చేశామని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి భగీరథ్ చౌదరి వెల్లడించారు. పలువురు అనర్హులైన రైతులకు పీఎం-కిసాన్ స్కీం మంజూరైందని, ఆ విషయాన్ని తాము గుర్తించి నిధులన్నీ రికవర్ చేశామని ఆయన తెలిపారు. భూమి రికార్డులు, ఆదాయపు పన్ను సమాచారం ఆధారంగా అనర్హులైన లబ్ధిదారులను గుర్తించామన్నారు.

అనర్హుల ఏరివేత ప్రక్రియలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేశాయని భగీరథ్ చౌదరి చెప్పారు. ఈమేరకు ఆయన లోక్‌సభ(Parliament)కు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. పీఎం-కిసాన్ స్కీంలో భాగంగా రైతుల ఖాతాలో ప్రతి సంవత్సరం రూ.6వేలు జమచేస్తారు. ఈ మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకు రూ.2వేలు చొప్పున మూడు విడతల్లో అందిస్తారు. 2019 ఫిబ్రవరి 24 నుంచి ఈ పథకం అమలవుతోంది.

Next Story