- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం: మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసిన గవర్నర్
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. గతకొన్ని రోజులుగా కొనసాగుతున్న హైడ్రామాకు తెరదించుతూ.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వాన్ని గవర్నర్ బర్తరఫ్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. గతకొన్ని రోజులుగా కొనసాగుతున్న హైడ్రామాకు తెరదించుతూ.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వాన్ని గవర్నర్ బర్తరఫ్ చేశారు. ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ అధికార పీఠాన్ని వదిలేందుకు మమత నిరాకరించడంతో, రాజ్యాంగ నిబంధనల ప్రకారం గవర్నర్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ స్పష్టమైన ఓటమిని చవిచూసింది. ప్రజా తీర్పు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు మమతా బెనర్జీ మొండికేయడం రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభానికి దారితీసింది. మమత వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన గవర్నర్, వేచి చూసే ధోరణి వీడి చివరకు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధం..
మరోవైపు, ఈ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సాధించిన భారతీయ జనతా పార్టీ (BJP) ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. ప్రజలు తమకు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తామని బీజేపీ నేతలు ప్రకటించారు. గవర్నర్ నుంచి ఆహ్వానం అందిన వెంటనే కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రజా తీర్పును గౌరవించకుండా పదవిలో కొనసాగాలని చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని గవర్నర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటం మరియు రాజ్యాంగబద్ధమైన పాలనను పునరుద్ధరించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. మమతా బెనర్జీ బర్తరఫ్, బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుతో బెంగాల్ రాజకీయాల్లో దశాబ్దాల కాలం నాటి ఆధిపత్య పోరుకు కొత్త ముగింపు లభించినట్లయింది.






