- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళ రాజకీయంలో మరో సంచలన ట్విస్ట్: విజయ్ ప్రమాణ స్వీకారానికి గవర్నర్ బ్రేక్
తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. రేపు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారన్న ప్రచారానికి లోక్‌భవన్ (గవర్నర్ కార్యాలయం) బ్రేక్ వేసింది.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. రేపు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారన్న ప్రచారానికి లోక్‌భవన్ (గవర్నర్ కార్యాలయం) బ్రేక్ వేసింది. సాంకేతిక కారణాలు, మద్దతు లేఖల సేకరణలో తలెత్తిన లోపాల వల్ల రేపు ప్రమాణ స్వీకారం ఉండబోదని లోక్‌భవన్ వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో ఒక్కసారిగా తమిళనాట రాజకీయ సమీకరణాలు తలకిందులయ్యాయి. తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. అయితే, ప్రస్తుత పరిణామాల తర్వాత విజయ్ బలం 116 వద్దే ఆగిపోయినట్లు తెలుస్తోంది. టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నుంచి మాత్రమే మద్దతు లేఖలు గవర్నర్‌కు అందాయి. కీలకమైన వీసీకే (VCK), ఐయూఎంఎల్ (IUML) పార్టీల నుంచి మద్దతు లేఖలు గవర్నర్ కార్యాలయానికి అందకపోవడం ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారింది. స్పష్టమైన మెజారిటీ (118) నిరూపించే లేఖలు అందే వరకు ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని గవర్నర్ తేల్చి చెప్పారు.
చెన్నైలో టెన్షన్..
విజయ్ బలం 116 దగ్గరే నిలిచిపోవడంతో, ఆ ఒక్క అడుగు మెజారిటీ కోసం టీవీకే నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మద్దతు ఇస్తామన్న పార్టీలు లేఖలు ఎందుకు పంపలేదు? దీని వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా? అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. "సాంకేతిక కారణాల వల్ల మద్దతు లేఖలు అందడంలో జాప్యం జరిగింది. రేపు ప్రమాణ స్వీకారం ఉండదు. తదుపరి షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తాం" అని లోక్‌భవన్ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. రేపు తమ అభిమాన నటుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడని సంబరాలకు సిద్ధమైన విజయ్ అభిమానులకు ఈ వార్త చేదు నిజంగా మారింది. మరోవైపు ప్రతిపక్షాలు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. ఆ ఒక్క ఎమ్మెల్యే మద్దతు విజయ్‌కు దక్కుతుందా? లేక తమిళనాడులో మళ్లీ రాజకీయ అనిశ్చితి మొదలవుతుందా? అన్నది ఇప్పుడు సంచలనంగా మారింది.






