వీసీల నియామకంలో గవర్నర్లదే కీలక పాత్ర

by Ajay Maddhiboyina |

పశ్చిమ బెంగాల్‌లోని 34 యూనివర్సిటీల వీసీల నియామకం విషయంలో ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్, తృణమూల్ ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన విభేదాల నేపథ్యంలో జగదీశ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

వీసీల నియామకంలో గవర్నర్లదే కీలక పాత్ర
X

- కొత్త యూజీసీ నోటిఫికేషన్‌కు కట్టుబడి ఉండాల్సిందే

- యూజీసీ చైర్మన్ ఎం.జగదీశ్ కుమార్

దిశ, నేషనల్ బ్యూరో:

రాష్ట్రాల్లోని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ (వీసీ)ల నియామకంలో గవర్నర్లకే కీలక అధికారాలు ఇస్తూ ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు అన్ని రాష్ట్రాలు కట్టుబడి ఉండాల్సిందే అని యూజీసీ చైర్మన్ ఎం. జగదీశ్ మరోసారి స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని 34 యూనివర్సిటీల వీసీల నియామకం విషయంలో ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్, తృణమూల్ ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన విభేదాల నేపథ్యంలో జగదీశ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కోల్‌కతాలోని సెయింట్ జేవియర్స్ కాలేజీ కాన్వొకేషన్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన జగదీశ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి యూనివర్సిటీ ఛాన్సలర్లకే వీసీలను నియమించే అధికారం ఉంది. కొత్త డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఈ నిబంధనలో ఎలాంటి మార్పు ఉండబోదు అని జగదీశ్ పేర్కొన్నారు. 2010 యూజీసీ నిబంధనలు ఇప్పటికే ఛాన్సలర్‌కు వీసీ నియామకంలో కీలకమైన బాధ్యతలు అప్పగించిందని ఆయన వెల్లడించారు.

Next Story