- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్యాస్ కొరతపై సర్కార్ కీలక నిర్ణయం.. కట్టెల పొయ్యిలకు అనుమతి
గ్యాస్ కొరతపై కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో కట్టెల పొయ్యిలకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: గ్యాస్ కొరతపై కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో కట్టెల పొయ్యిలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. శనివారం ఢిల్లీలో కట్టెల పొయ్యిలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. కాగా, ఢిల్లీలో పొల్యూషన్‌ను తగ్గించడానికి గతంలో బొగ్గు పొయ్యిలను నిషేధించారు. ఎవరైనా రూల్స్‌ను బ్రేక్ చేస్తే భారీగా జరిమానా విధించనున్నారు. సాధారణంగా ఢిల్లీలో బొగ్గు పొయ్యిలపై కాల్చి తయారు చేసే తందూరీకి గిరాకీ ఎక్కువ. ఢిల్లీలోని లజపత్ నగర్, కరోల్ బాగ్, సుభాష్ నగర్ వంటి ప్రాంతాలు తందూరీ, టిక్కాలకు ఫేమస్. సాయంత్రం వేళ టూరిస్టులతో ఈ ప్రాంతం బిజీగా మారుతుంది. అయితే, బొగ్గు పొయ్యిలపై నిషేధం విధించడంతో రెస్టారెంట్లు బొగ్గు, కట్టెల పొయ్యి స్థానంలో కాంపాక్ట్ గ్యాస్, ఎలక్ట్రిక్ యూనిట్లను వాడుతున్నాయి. కానీ చిన్న చిన్న హోటల్స్, రోడ్డు సైడ్ సెంటర్లు ఇంకా పాత పద్ధతినే కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయం హోటల్స్‌కు ఊరట కలిగించనుంది. మరోవైపు దేశ వ్యాప్తంగా ఏర్పడ్డ గ్యాస్ కొరత కారణంగా అనే హోటళ్లు మూతపడే పరిస్థితికి చేరుకున్నాయని గతకొన్ని రోజులుగా వార్తలు విస్తృతమయ్యాయి.






