- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్య ప్రైవేట్ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసిన ప్రభుత్వ అధికారి
మహారాష్ట్రలోని పుణె నగరంలో (Pune) దారుణమైన ఘటన వెలుగుచూసింది.

దిశ, వెబ్ డెస్క్: భార్య స్నానం చేస్తుండగా.. భర్త రహస్యం వీడియోలు తీశాడు. అనంతరం డబ్బు కోసం ఆ వీడియోలు బయటపెడతానంటూ ఆమెను బ్లాక్ మొయిల్ చేశారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని (Maharasta) పుణె నగరంలో వెలుగుచూసింది. అంబేగావ్‌లో నివాసం ఉంటున్న ఓ జంట 2020లో పెళ్లి చేసుకున్నారు. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. అయితే, ఇటీవల ప్రభుత్వ ఉద్యోగి అయిన తన భర్త తాను స్నానం చేస్తుండగా.. రహస్యంగా కెమెరాలతో వీడియోలు చిత్రీకరించి డబ్బు కోసం బ్లాక్ మొయిల్ చేస్తున్నాడంటూ క్లాస్ 1 ప్రభుత్వ అధికారిణిగా పనిచేస్తున్న బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. కారు, ఇంటి రుణం చెల్లించడానికి తనకు డబ్బులు కావాలని, అందుకోసం పుట్టింటి నుంచి రూ.1.5 లక్షలు తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నాడని తెలిపింది. లేదంటే ఆ వీడియోలు బయటపెడతానని బెదిరిస్తున్నట్లు పోలీసుల ముందు వాపోయింది. అతడి కుటుంబ సభ్యుల కూడా తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా సాంకేతిక ఆధారాలు, వీడియో ఫుటేజ్‌లు వంటివి పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అయితే,ఈ ఘటన మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తగా, ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేపుతోంది.






