భారత ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ రసాయనాలపై దిగుమతి సుంకం రద్దు

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-02 03:56:13  IST  )

భారత ప్రభుత్వం కీలక రసాయనాలపై దిగుమతి సుంకాన్ని (Import Duty) తాత్కాలికంగా రద్దు చేసింది.

భారత ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ రసాయనాలపై దిగుమతి సుంకం రద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ పరిశ్రమలకు ఊరటనిస్తూ సప్లయ్‌ లింక్‌ను మరింత బలోపేతం చేసేందుకు భారత ప్రభుత్వం (Government Of India) కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు కొన్ని ముఖ్యమైన రసాయనాలపై దిగుమతి సుంకాన్ని (Import Duty) తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లుగా ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ మినహాయింపులు నేటి నుంచి జూన్ 30, 2026 వరకు 3 నెలల పాటు అమలులో ఉండనున్నాయి. దిగుమతి సుంకం రద్దు మినహాయింపు పొందిన కెమికల్స్‌లో అమ్మోనియం నైట్రేట్, మెథనాల్, స్టైరీన్, ఎసిటిక్ యాసిడ్, పాలీవినైల్ క్లోరైడ్ (PVC) ఉన్నాయి. అదేవిధంగా రసాయనాలతో పాటు, అమ్మోనియం నైట్రేట్‌పై విధించే అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్ (AIDC) నుంచి కూడా ప్రభుత్వం మినహాయింపునిచ్చారు.

ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల వ్యవసాయం, నిర్మాణం, తయారీ రంగాలకు అవసరమైన ముడి సరుకుల ధరలు తగ్గే అవకాశం ఉంది. దీంతో పారిశ్రామిక ఉత్పాదకత పెరగడమే కాకుండా, వినియోగదారులపై ధరల భారం తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. గుజరాత్‌లోని భరూచ్ వంటి కెమికల్ హబ్‌లలో ఉన్న పరిశ్రమలకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిస్తుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

Next Story