- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nitin Gadkari: ప్రైవేట్ వాహనాలకు టోల్ వసూలు బదులుగా నెలవారీ, వార్షిక పాస్‌లు
గ్రామాస్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా గ్రామాల వెలుపల టోల్ వసూలు బూత్‌ను ఏర్పాటు చేస్తాం.

దిశ, నేషనల్ బ్యూరో: జాతీయ రహదారులపై ప్రైవేట్ వాహనాలకు టోల్ వసూలుకు బదులుగా నెలవారీ, వార్షిక పాస్‌లను ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. టోల్ తగ్గించడంలోని అడ్డంకులు అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన నితిన్ గడ్కరీ.. గ్రామాస్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా గ్రామాల వెలుపల టోల్ వసూలు బూత్‌ను ఏర్పాటు చేస్తాం. టోల్ ఆదాయంలో 74 శాతం కమర్షియల్ వాహనాల నుంచే వస్తోంది. కాబట్టి ప్రైవేట్ వాహనాలకు నెలవారీ లేదా వార్షిక పాస్‌ను ఇవ్వడాన్ని పరిశీలిస్తున్నాం. మొత్తం టోల్ వసూళ్లలో ప్రైవేట్ వాహనాల వాటా 26 శాతం మాత్రమే ఉండటంతో ప్రభుత్వానికి పెద్దగా నష్టం ఉండదని గడ్కరీ అభిప్రాయపడ్డారు. అలాగే, ఫాస్టాగ్ విధానాన్ని కొనసాగిస్తూనే అదనంగా నేషనల్ హైవేలపై అడ్డంకులు లేని గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(జీఎన్ఎస్ఎస్) ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించినట్టు గడ్కరీ చెప్పారు. ఈ విధానం ప్రస్తుతం ఉన్న దాని కంటే మెరుగ్గా ఉంటుందన్నారు. ఇప్పటికే జీఎన్ఎస్ఎస్ విధానాన్ని కర్ణాటకలోని బెంగళూరు-మైసూర్ సెక్షన్, హర్యానాలోని పానిపట్-హిసార్ మధ్య పైలట్ ప్రాజెక్టుగా పరిశీలించామని గడ్కరీ పేర్కొన్నారు.






