2026లో ప్రభుత్వ సెలవులివే

by Muthe.Rajitha |

కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గానూ సెలవుల జాబితా విడుదల చేసింది.

2026లో ప్రభుత్వ సెలవులివే
X

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గానూ సెలవుల జాబితా విడుదల చేసింది. వీటిలో 14 జనరల్ హాలిడేస్ 12 ఆప్షనల్ సెలవులు ఇచ్చింది. వీటిలో జనవరి 26 (రిపబ్లిక్ డే), మార్చి 2 (మహా శివరాత్రి), మార్చి 15 (హోలీ), ఏప్రిల్ 10 (మహావీర్ జయంతి), ఏప్రిల్ 11 (గుడ్ ఫ్రైడే), ఏప్రిల్ 14 (అంబేడ్కర్ జయంతి), ఏప్రిల్ 20 (శ్రీరామ నవమి), మే 1 (మే డే), ఆగస్టు 15 (స్వాతంత్ర్య దినోత్సవం), అక్టోబర్ 2 (గాంధీ జయంతి), అక్టోబర్ 20 (విజయదశమి), అక్టోబర్ 27 (దీపావళి), నవంబర్ 6 (ఈదుల్ ఫితర్), డిసెంబర్ 25 (క్రిస్మస్) గెజిటెడ్ సెలవులు ఉన్నాయి.

ఇవే కాకుండా ఉద్యోగులు రెస్ట్రిక్టెడ్ హాలిడేస్ జాబితా నుంచి రెండు రోజులు ఎంచుకోవచ్చు అనగా ఉగాది, బుద్ధ పూర్ణిమ, జన్మాష్టమి, గణేష్ చతుర్థి, గురు నానక్ జయంతి వంటివి. ఇక ఇస్లామిక్ పండుగలు ఈదుల్ ఫితర్, బక్రీద్, మిలాదున్నబీ మొదలగు పండగల తేదీలు చంద్రదర్శనం ఆధారంగా మారవచ్చునని తెలిపింది.

Next Story