- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనతో కేంద్రానికి సంబంధం లేదు: న్యాయశాఖ మంత్రి
జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనతో కేంద్రానికి సంబంధం లేదని, ఇది పూర్తిగా పార్లమెంటు చేతుల్లో ఉన్న విషయమని న్యాయశాఖ మంత్రి చెప్పారు.

దిశ, నేషనల్ బ్యూరో: అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన అంశంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏమాత్రం లేదని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తెలిపారు. ఈ అంశం పూర్తిగా పార్లమెంటు చేతుల్లో ఉంటుందని ఆయన చెప్పారు. మాజీ సీజేఐ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కమిటీ ఈ అంశంపై దర్యాప్తు చేసి, రిపోర్టును సబ్మిట్ చేసిందని గుర్తుచేశారు. ‘ఈ విషయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టు లేదా హైకోర్టుకు వెళ్లడం ఆయనకు ఉండే హక్కు.
ఇక ఆయన అభిశంసన విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండదు. ఇది కేవలం ఎంపీల చేతుల్లో ఉండే విషయం. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలను తొలగించే అధికారం పార్లమెంటుకే ఉంటుంది’ అని ఆయన వివరించారు. ‘రాజ్యాంగం ప్రకారం అభిశంసన తీర్మానంపై 100 మంది లోక్‌సభ ఎంపీలు, 50 మంది రాజ్యసభ ఎంపీలు సంతకం చేయాలి. అంటే ఇది పూర్తిగా పార్లమెంటుకు సంబంధించిన అంశం. దీంతో ప్రభుత్వానికి సంబంధం లేదు’ అని మేఘవాల్ పేర్కొన్నారు.






