- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
19 రూల్స్‌తో విధాన సౌధ ఈవెంట్‌కు పర్మిషన్.. లేఖ రాసింది కర్ణాటక క్రికెట్ అసోసియేషనే!
19 రూల్స్‌తో విధాన సౌధ వద్ద ఆర్సీబీ ఈవెంట్‌కు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీని కోసం లేఖ రాసింది కర్ణాటక క్రికెట్ అసోసియేషనే!

దిశ, నేషనల్ బ్యూరో: బెంగళూరు తొక్కిసలాటకు సంబంధించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. విధాన సౌధ వద్ద ఈవెంట్ చేసుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం ఆమోదించినట్లు తెలుస్తోంది. దీనికోసం రూ.15 లక్షల డిపాజిట్ సహా మొత్తం 19 కండీషన్స్ పెట్టిన సర్కారు.. ఈవెంట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విధాన సౌధ వద్ద జూన్ 4న ఆర్సీబీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ)కు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ (డీపీఏఆర్) అనుమతిచ్చింది. విధాన సౌధ సెక్యూరిటీ విభాగం, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్లియరెన్స్ ఇవ్వడంతోనే ఈ అనుమతి లభించినట్లు తెలుస్తోంది.
ఈవెంట్‌కు ముందే శానిటైజేషన్ కోసం రూ.10 వేలు కట్టించుకున్న ప్రభుత్వం.. టెంట్లు వంటి నిర్మాణాలను ఉపయోగించుకోవడానికి రూ.15 లక్షలు డిపాజిట్ కట్టించుకుందట. విధాన సౌధ మెట్లు, అక్కడి విగ్రహాలు, రోడ్లు, తోటలు.. ఎక్కడా ఎలాంటి నష్టం జరగకపోతే ఈ రూ.15 లక్షలు రీఫండ్ చేస్తామని ప్రభుత్వం చెప్పిందట. ప్లాస్టిక్ వాడకం, డ్రోన్ల వినియోగాన్ని అధికారులు నిషేధించారు. అలాగే పోలీసులు, బీబీఎంపీ, ఫైర్ సర్వీసు, ఆరోగ్య శాఖ అధికారులతో కో-ఆర్డినేట్ చేసుకొని కార్యక్రమం సాఫీగా సాగేలా చూసుకోవాలని నిర్వాహకులకు ప్రభుత్వం తెలిపిందట.
ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అనుమతి కోరుతూ.. ‘ఒకవేళ ఆర్సీబీ గెలిస్తే విధాన సౌధ వద్ద కార్యక్రమం చేసుకోవడానికి అనుమతివ్వండి. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ముఖ్యఅతిథులుగా వస్తారు’ అంటూ జూన్ 3వ తేదీనే కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ లేఖ రాసింది. అయితే చిన్నస్వామి స్టేడియంలో కార్యక్రమం గురించి ఈ లేఖలో ప్రస్తావించలేదు. కాగా, తొక్కిసలాటతో తమకేం సంబంధం లేదని, ఇదంతా ప్రభుత్వ నిర్ణయమేనని కేఎస్‌సీఏ.. ఈ ఘటన నుంచి దూరం జరిగే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఈ లేఖ బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది.






