ఇస్లాంపూర్ పేరు మారుస్తూ సర్కార్ నిర్ణయం.. అసెంబ్లీలో ప్రకటన

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-18 09:38:35  IST  )

మహారాష్ట్ర ప్రభుత్వం (Government of Maharashtra) శుక్రవారం సాంగ్లీ (Sangli) జిల్లాలోని ఇస్లాంపూర్‌ (Islampur) గ్రామం పేరును ఈశ్వర్‌పూర్‌ (Ishwarpur)గా మారుస్తు నిర్ణయం తీసుకుంది.

ఇస్లాంపూర్ పేరు మారుస్తూ సర్కార్ నిర్ణయం.. అసెంబ్లీలో ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర ప్రభుత్వం (Government of Maharashtra) శుక్రవారం సాంగ్లీ (Sangli) జిల్లాలోని ఇస్లాంపూర్‌ (Islampur) గ్రామం పేరును ఈశ్వర్‌పూర్‌ (Ishwarpur)గా మారుస్తు నిర్ణయం తీసుకుంది. వర్షాకాల సమావేశం ఆఖరి రోజున రాష్ట్ర అసెంబ్లీలో ఈ విషయాన్ని ఆహరం, పౌర సరఫరాల శాఖ మంత్రి ఛగన్ భుజ్బల్ (Minister Chhagan Bhujbal) ప్రకటించారు. అయితే, గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో సాంగ్లీ జిల్లాలోని ఇస్లాంపూర్ గ్రామం పేరును మార్చేందుకు ఆమోదం తెలిపినట్లుగా మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా కేబినెట్ నిర్ణయాన్ని కూడా త్వరలోనే కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపిస్తామని వెల్లడించారు. కాగా, హిందుత్వ సంస్థ శివ ప్రతిష్ఠాన్, ఇస్లాంపూర్ పేరును ఈశ్వర్‌పూర్‌గా మార్చాలని సాంగ్లీ కలెక్టరేట్‌కు ఒక మెమోరాండం సమర్పించారు. అయితే, ఆ మెమోరాండం ప్రభుత్వానికి చేరడంతో కేబినెట్‌లో చర్చించి గ్రామం పేరు మార్పుపై 39 ఏళ్ల తరువాత నిర్ణయం తీసుకున్నారు. శివ ప్రతిష్ఠాన్‌ సంస్థకు సంభాజీ భిడే (Sambhaji Bhide) నేతృత్వం వహిస్తున్నారు.

Next Story