బస్సుపై అరుణాచలం అనే పేరు.. కండక్టర్ సస్పెండ్

by Naga Rani Yarlagadda |

అరుణాచలం.. 2021 నుంచి ఈ పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

బస్సుపై అరుణాచలం అనే పేరు.. కండక్టర్ సస్పెండ్
X

దిశ, వెబ్‌డెస్క్: అరుణాచలం.. 2021 నుంచి ఈ పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా పౌర్ణమి తిథిలో గిరి ప్రదక్షిణ (Arunachalam Giri Pradakshina) చేస్తే మంచిదని ప్రముఖ ప్రవచన కర్తలు చెబుతుండటంతో ఆరోజున లక్షల్లో భక్తులు అరుణాచలంకు క్యూ కడుతున్నారు. అయితే.. అరుణాచలంనే తిరువణ్ణామలై (Tiruvannamalai) అని పిలుస్తారు. ఓ బస్సులో తిరువణ్ణామలైకు బదులుగా.. అరుణాచలం అనే స్క్రోల్ బోర్డు పెట్టినందుకు గాను తమిళనాడు ఆర్టీసీ (Tamilnadu RTC) యాజమాన్యం సీరియస్ అయింది. బోర్డు పెట్టిన కండక్టర్ ను సస్పెండ్ చేసింది. కళ్లకురిచ్చి డిపో (Kallakurichi Depot) నుంచి బెంగళూరుకు బయల్దేరిన బస్సులో ఇది జరిగింది. ఎల్ఈడీ స్క్రీన్ పై అరుణాచలం అని రావడంతో.. ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

వారితోపాటు ఒక సోషల్ వర్కర్ మన ప్రాంతం పేరును అవమానించారా అని ప్రభుత్వ రవాణా సంస్థను ప్రశ్నించడంతో.. వెంటనే సదరు కండక్టర్ విజయ రాఘవన్ పై చర్యలు తీసుకుంది. అతడిని సస్పెండ్ చేస్తూ విల్లుపురం (Villupuram) జోన్ జనరల్ మేనేజర్ జయశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. తిరువణ్ణామలైకు వెళ్లే బస్సుల్లో తప్పనిసరిగా ఆ పేరును మాత్రమే స్క్రోల్ చేయాలని కండక్టర్లకు సూచించారు.

Next Story