- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NCMM: క్రిటికల్ మినరల్స్ రంగంలో స్వయం సమృద్ధి లక్ష్యం
క్రిటికల్ మినరల్స్ రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా కేబినేట్ సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, నేషనల్ బ్యూరో: క్రిటికల్ మినరల్స్ రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా కేబినేట్ సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినేట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (NCMM)కు ఆమోదం తెలిపింది. కాగా.. రూ.16,300 కోట్ల వ్యయంతో ఈ మిషన్‌ను అమలు చేయనున్నట్లు కేంద్ర సమాచార ప్రసారాలశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. మన దేశంలో, ఆఫ్‌షోర్ ప్రదేశాల్లో కీలకమైన ఖనిజాల అన్వేషణను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ మిషన్‌ను చేపట్టనుంది. అరుదైన ఖనిజాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఈ రంగంలోనే దేశ స్వావలంబనను సాధించడమే తమ ఉద్దేశమని చెప్పుకొచ్చారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు కంపెనీలు ఇలాంటి దేశాలతో వాణిజ్యాన్ని మెరుగుపరచడానికి దోహదపడుతోందన్నారు. వనరులు అధికంగా ఉన్న దేశాలతో వాణిజ్యాన్ని మెరుగుపరచడం, దేశీయంగా రుదైన ఖనిజ నిల్వల్ని అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. అంతేకాకుండా, మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్ ధర లీటర్‌కు రూ.56.28 నుంచి రూ.57.97కు పెంచేందుకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపాలన్న లక్ష్యానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.






