- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలోని రైతులకు కేంద్రం శుభవార్త.. ఫర్టిలైజర్ సబ్సిడీకి కేబినెట్ ఆమోదం
దేశంలోని రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం (Government of India) పండుగల లాంటి వార్త చెప్పింది.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం (Government of India) పండుగ లాంటి వార్త చెప్పింది. ఈ మేరకు ఇవాళ ప్రధాన నరేంద్ర మోడీ (PM Narendra Modi) అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఫర్టిలైజర్ సబ్సిడీ రూ.3 వేల కోట్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అన్నదాతలకు ఎరువులను సరసమైన ధరలకు కొనుగోలు చేయగలిగేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతర్జాతీయ ఎరువుల మార్కెట్‌లో హెచ్చుతగ్గులకు అనుగుణంగా ధరలను సమతుల్యం చేయడం, DAP వంటి ఎరువుల రిటైల్ ధరను కాపాడటం ఈ ఫర్టిలైజర్ సబ్సిడీ ప్రధాన లక్ష్యమని సమాచారం. ముఖ్యంగా ఈ సబ్సిడీతో రైతులకు ఎరువులు నిరంతరం అందుబాటులో ఉండటం, ఆహార భద్రత, వ్యవసాయ వృద్ధి మద్దతుకు ఊతం ఇవ్వనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంలో దేశంలోని 14.6 కోట్ల మంది అన్నదాతలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుంది.
Next Story






