- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking News : రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్
దేశంలో రైతుల కోసం మరో కొత్త పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో రైతుల కోసం మరో కొత్త పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) అధ్యక్షతన బుధవారం భేటీ అయిన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పశువుల ఆరోగ్యం కోసం క్రిటికల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్‌ను(CADCP) ప్రవేశపెడుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కోసం రూ.3880 కోట్లను కేటాయించింది. ఈ పథకం కింద పశువులకు వ్యాక్సిన్లు వేయడంతో పాటు.. తక్కువ ధరకే వాటికి అవసరమైన మందులు అందించేందుకు పశు ఔషధ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ పథకం ద్వారా టీకాలు వేయడం, పశువుల ఆరోగ్యంపై నిఘా, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా పశువులకు వ్యాధులు రాకుండా నివారించడం, వ్యాధుల నియంత్రణలో సహాయపడుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఈ పథకం పశు సంపద ఉత్పాదకతను మెరుగుపరుస్తుందని పేర్కొన్నాయి. అంతేకాకుండా రైతులకు కూడా ఉపాధిని సృష్టిస్తుందని తెలిపాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవస్థాపకతను ప్రోత్సహిస్తుందని.. పశువుల వ్యాధుల బారిన పడకుండా, రైతులు ఆర్థికంగా నష్టపోకుండా చేస్తుందని వెల్లడించాయి.






