దేశంలోని రైతులకు తీపికబురు.. కొత్త పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం

by Kema Shiva Kumar |

ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అధ్యక్షతన ఆయన నివాసంలో ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది.

దేశంలోని రైతులకు తీపికబురు.. కొత్త పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
X

దిశ, వెబ్‌‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అధ్యక్షతన ఆయన నివాసంలో ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. ఈ భేటీలో అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌తో సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. సమావేశం ముగిసిన వెంటనే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ఈ భేటీలో భాగంగా పీఎం ధన్‌ధాన్య కృషి యోజన పథకాని (PM Dhan Dhanya Krishi Yojana Scheme)కి ఆమోదం తెలిపినట్లుగా వెల్లడించారు. ఈ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 1.70 కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష్యంగా లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, పంట వైవిధ్యతను ప్రోత్సహించడం, పంచాయతీ స్థాయిలో పంటకోత తర్వాత నిల్వలను బలోపేతం చేయడం, నీటిపారుదల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, రైతులకు స్వల్ప, దీర్ఘకాలిక రుణ లభ్యతను పెంచడం ఈ పథకం లక్ష్యమని తెలిపారు. దేశ శ్యాప్తంగా 100 వ్యవసాయ ఆధారిత జిల్లాలను అభివృద్ధి చేయనున్నట్లుగా మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.

Next Story