దేశంలోని అన్నదాతలకు తీపికబురు.. భారీగా తగ్గనున్న ఎరువుల ధరలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-19 04:30:13  IST  )

పొరుగు దేశం చైనా (China)తో దౌత్యపరమైన చర్చలు భారత్‌ (India)కు సత్ఫలితాలను ఇస్తున్నాయి.

దేశంలోని అన్నదాతలకు తీపికబురు.. భారీగా తగ్గనున్న ఎరువుల ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: చైనా ఎరువుల సరఫరాను తగ్గించడం, నిలిపివేయడంతో భారతదేశంలో కొన్నాళ్లుగా ఎరువుల కొరత ఏర్పడింది. ముఖ్యంగా డీ-అమోనియం ఫాస్ఫేట్ (DAP)తో పాటు ఇతర ప్రత్యేక ఎరువుల సరఫరాలో అంతరాయాలు ఏర్పడ్డాయి. ఆ పరిణామాలతో ఎరువుల ధరలను పెరగడం వల్ల దేశంలోని రైతులపై ఆర్థిక భారం పడింది. ఈ నేపథ్యంలోనే తాజాగా పొరుగు దేశం చైనా (China)తో దౌత్యపరమైన చర్చలు భారత్‌ (India)కు సత్ఫలితాలను ఇస్తున్నాయి. భారత్ పర్యటనలో భాగంగా ఇటీవలే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌ (Jaishankar)తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ (Wang Yi) భేటీ అయ్యారు. ఈ మేరకు ఆయన దేశంలోకి రైతాంగానికి తీపికబురు చెప్పారు. చైనా నుంచి భారతదేశానికి ఎరువులు, అరుదైన ఖనిజాలను సరఫరా చేసేందుకు ఆమోదం తెలుపుతున్నట్లుగా ప్రకటించారు.

చైనాకు భారత్‌కు ప్రధాన యూరియా (Urea) దిగుమతిదారుగా ఉందనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే, ప్రస్తుతం తమ దేశం నుంచి సరఫరా చేస్తున్న యూరియా, ఇతర ఎరువుల ఎగుమతులపై నిర్బంధాలను సడలించబోతున్నట్లుగా పేర్కొన్నారు. దీంతో సరఫరా పరిమితులు భారీగా పెరిగి, భారీగా ఎరువుల ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. చైనా ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles)తో పాటు ఇతర అధిక సాంకేతిక పరిశ్రమలలో ఉపయోగించే అరుదైన ఖనిజాల కోసం ఎగుమతి లైసెన్సులకు ఆమోద్ర ముద్ర వేయనున్నారు. ప్రస్తుతం ఖనిజాల కొరతను ఎదుర్కొంటున్న భారతదేశానికి ఇది సువర్ణవకాశం. అదేవిధంగా టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్లు (Tunnel Boring Machines) సరఫరా చేయడానికి కూడా డ్రాగన్ దేశం అంగీకారం తెలిపింది.

Next Story