- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Good news: గ్యాస్ రాయితీపై కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం (Pradhan Mantri Ujwala Yojana) లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పథకం లబ్ధిదారులకు గ్యాస్ రాయితీ 2025-26 ఆర్థిక సంవత్సరం కూడా కొనసాగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇవాళ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సెంట్రల్ కేబినెట్ (Central Cabinet) సమావేశం అయింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు కేబినెట్ వివరాలను మంత్రి అశ్వినీ కుమార్ వైష్ణవ్ (Ashwini Kumar Vaishnav) మీడియాకు వివరించారు. ఉజ్వల్ పథకం కొనసాగింపు కోసం రూ.12,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా 10.33 కోట్ల లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఉజ్వల్ పథకం కింద 14.2 కిలోల సిలిండర్ పై రూ. 300 రాయితీ ఏటా 9 సిలిండర్లకు వర్తింప చేస్తోంది.
ఎంఈఆర్ఐటీఈ పథకానికి రూ.4,200 కోట్లు:
సాంకేతిక విద్యా అభివృద్ధి కోసం మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇంప్రూవ్‌మెంట్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎంఈఆర్ఐటీఈ) పథకానికి మొత్తం రూ.4,200 కోట్లు కేటాయింస్తూ కేబినెట్ ఆమోదం తెలిపిందని అశ్వినీకుమార్ వైష్ణవ్ వెల్లడించారు. 275 సాంకేతిక విద్యా సంస్థల్లో దీనిని అమలు చేయనున్నారు. నైపుణ్యాలు, ఉపాధి అవకాశాల పెంపు ప్రధాన లక్ష్యంగా చేపడుతున్న ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 7.5 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనున్నట్లు అంచనా వేస్తున్నారు. అసోం, త్రిపుర రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద రూ. 4250 కోట్లు కేటాయింపునకు కేంబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. మౌలిక సదుపాయాలు, జీవనోపాధి ప్రాజెక్టుల అభివృద్ధి ఈ రాష్ట్రాల్లో ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని ఫలితంగా ఆదాయ ఉత్పత్తి జరుగుతుందని మంత్రి తెలిపారు. తమిళనాడులోని మరక్కనం నుండి పుదుచ్చేరి వరకు నాలుగు లేన్ల హైవేలను నిర్మించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టును మొత్తం 2,157 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుత కారిడార్‌లోని రద్దీని తగ్గిస్తుందని, చెన్నై, పుదుచ్చేరి విలుప్పురం, నాగపట్నం వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల మొబిలిటీ అవసరాలను తీరుస్తుందన్నారు.






