- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Paytm: పేటీఎం యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్
పేటీఎం తమ యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తమ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను స్థానిక భాషల్లో ఏఐ (AI) సపోర్ట్ తో అందించేందుకు వీలుగా పేటీఎం (Paytm) కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ స్టార్టప్ పర్ ప్లెక్సిటీతో (Perplexity) భాగస్వామ్యం కుదుర్చుకుంది. తమ యాప్ లో ఏఐ ఆధారిత సెర్చింగ్ కోసం ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని ఈ సౌలభ్యంతో యూజర్లు తమ స్థానిక భాషల్లో తమ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చని పేటీఎం పేర్కొంది. పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ మాట్లాడుతూ ప్రజలు సమాచారాన్ని యాక్సెస్ చేసి నిర్ణయాలు తీసుకునే విధానాన్ని ఏఐ మార్చివేస్తోంది. పర్ ప్లెక్సిటీతో మేము ఏఐ శక్తిని మిలియన్ల మంది భారతీయ వినియోగదారులకు అందజేస్తున్నామని తెలిపారు. ఆర్థిక అక్షరాస్యత, యాక్సెసిబిలిటీని పెరుగుపరచడానికి వినియోగదారులకు ఏఐ ఆధారిత సేవలు అందించడం ఈ ఒప్పందం లక్ష్యం అని పేటీఎం పేర్కొంది.
ఇదిలా పేటీఎంతో డీపీఐఐటీ నిన్న మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. అంకుర సంస్థలు కార్యకలాపాలు విస్తరించేందుకు, కొత్త ఆవిష్కరణలు చేసేందుక అవసరమైన మెంటార్ షిప్, నార్కెట్ యాక్సెస్, నిధులు, మౌళిక సదుపాయాలు వంటి వాటిల్లో సహకారం అందించేందుకు పేటీఎం కేంద్రం ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగా అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం డీసీఐఐటీ, పేటీఎం కు చెందిన ఫిన్ టెక్ సంస్థ అవగాహన ఒప్పందంకు సంబంధించిన పత్రాలు నిన్న బదిలీ చేసుకున్నారు.






