ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దేశంలోనే తొలిసారిగా రైళ్లలోనూ ATM సేవలు

by D.Reddy |   ( Updated:2025-04-17 13:21:34.0  )
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దేశంలోనే తొలిసారిగా రైళ్లలోనూ ATM సేవలు
X

దిశ, వెబ్ డెస్క్: యూపీఐ పేమెంట్స్ (UPI Payments) వచ్చాక చేతిలో లిక్విడ్ క్యాష్ క్యారీ చేయటం చాలా వరకు తగ్గిపోయింది. అయితే కొన్ని చోట్ల యూపీఐ సేవలు అందుబాటులో ఉండకపోవటం, మరి కొన్నిసార్లు సిగ్నల్ ప్రాబ్లమ్ వంటి కారణాలతో యూపీఐ పేమెంట్స్‌లో ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉంది. మరీ ముఖ్యంగా ప్రయాణాల్లో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. అయితే, ఇకపై యూపీఐ పనిచేయట్లేదు, చేతిలో డబ్బులేవ్ ఎలాగని చింతించాల్సిన పనిలేదు. ఎందుకంటే.. ప్రయాణికులకు సూపర్ గుడ్ న్యూస్ చెబుతూ భారతీయ రైల్వే శాఖ (Indian Railways) సంచలన నిర్ణయం తీసుకుంది.

ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకు రైల్వే శాఖ దేశంలోనే తొలిసారిగా రైళ్లలో ఏటీఎం (ATM) సేవలను అందుబాటులో తీసుకొచ్చింది. అయితే, తొలుత ప్రయోగాత్మకంగా నాసిక్‌లోని మన్మాడ్-ముంబై మధ్య నడిచే పంచవతి ఎక్సెప్రెస్‌ ఏసీ బోగీలో ఏటీఎంను ఏర్పాటు చేసింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర భుసావల్ డివిజన్ సహకారంతో దీనిని ఏర్పాటు చేసింది. రైలు కదులుతున్నప్పుడు భద్రత పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి దీనికి షట్టర్‌ డోర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి కోచ్‌లో అవసరమైన మార్పులను మన్మాడ్ వర్క్‌షాప్‌లో చేపట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు. త్వరలోనే మిగతా రైళ్లలోనూ ఏటీఎంలు వచ్చే అవకాశం ఉంది.



Next Story