ఎగుమతిదారులకు గుడ్ న్యూస్.. ఎక్స్‌పోర్టు ప్రమోషన్ మిషన్‌‌కు కేంద్రం ఆమోదం

by Kema Shiva Kumar |

ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది.

ఎగుమతిదారులకు గుడ్ న్యూస్.. ఎక్స్‌పోర్టు ప్రమోషన్ మిషన్‌‌కు కేంద్రం ఆమోదం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ క్రమంలోనే భేటీలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ పేలుడు ఘటనను కేంద్ర కేబినెట్ ఖండించిందని తెలిపారు. బాంబ్ బ్లాస్ట్‌లో ప్రాణాలు కోల్పోయిన వారికి రెండు నిమిషాల మౌనం పాటించామని అన్నారు. అదేవిధంగా ఉగ్రవాదంపై పోరును కొనసాగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని.. బాధ్యులను త్వరలోనే చట్టం ముందు నిలబెడతామని వెల్లడించారు. ఇక ఎక్స్‌పోర్టు ప్రమోషన్ మిషన్‌ (Export Promotion Mission)కు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసిందని.. ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం రూ.25,060 కోట్ల ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. ఎగుమతిదారులకు కోసం క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ (Credit Guarantee Scheme) ప్రవేశపెట్టబోతున్నాయని తెలిపారు. ఖనిజాల అన్వేషణ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

Next Story