- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జీతాలు భారీగా పెరిగే ఛాన్స్?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు.. 8 వ వేతన సంఘం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు.. 8 వ వేతన సంఘం కోసం ఆతృతతో ఎదురుచూస్తున్నారు. అయితే దేశంలో 7వ వేతన సంఘం జనవరి 1, 2016 నుంచి అమలులోకి వచ్చింది. దీని ద్వారా దాదాపుగా కోటి మంది లభ్ది పొందినట్లు తెలుస్తోంది. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి పే కమీషన్ అమలవుతుంది. కాబట్టి ఇప్పుడు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2026 జనవరి 1 నుచి 8 వ కమీషన్ ను అమలుచేస్తోందని భావిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనంలో మరియు పెన్షన్ లో పెద్ద మార్పులే రావొచ్చని సమాచారం. ఇదిలా ఉండగా 7 వ వేతన సంఘం పదవీ కాలం డిసెంబర్ 31, 2025 తో ముగుస్తుందని మాత్రం వెల్లడించలేదు. ఇలాంటి సమయంలో 10 ఏళ్లలో ఈసారి కొత్త వేతన సంఘం అమలవుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు ఉన్నారు. కాగా 8 వ వేతన సంఘానికి సంబంధించి ప్రభుత్వం మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ విషయం గురించే స్పష్టత ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ విషయం గురించే ఆర్ధిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ ను ప్రశ్నించగా.. దానికి ఇంకా సమయం ఉందని చెప్పినట్లు సమాచారం.
అయితే.. 6 వ వేతన సంఘం నుంచి 7 వ వేతన సంఘానికి మారిన సందర్బంగా, వేతన సవరణలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ను 3.68 గా ఉంచాలని ఉద్యోగుల సంఘం డిమాండ్ చేయగా.. ప్రభుత్వం దాన్ని 2.57 గా ఉంచింది. ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ సహాయంతో కేంద్ర ఉద్యోగుల కనీస వేతనాన్ని రూ. 7000 నుంచి రూ. 18000 లకు పెంచారు. దీంతో పాటూ కనీస పెన్షన్ ని కూడా రూ. 3500 నుంచి రూ. 9000 లకు పెరిగింది. పనిచేసే ఉద్యోగుల గరిష్ట వేతనం రూ. 2.50 లక్షలు కాగా.. గరిష్ట పెన్షన్ కూడా రూ. 1. 25 లక్షలుగా మారింది. ఒకవేళ 8 వ వేతన సంఘంలో ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ కు ఆమోదం లభిస్తే.. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1. 92 కు పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల ద్రవ్యోల్భణంలో సతమవుతున్న ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట లభించినట్లే.






