- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. 2 శాతం డీఏ పెంపు
కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ లభించింది. డీఏ పెంపుపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్.. కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ పెంపుపై సుదీర్ఘంగా చర్చించింది..

దిశ, వెబ్ డెస్క్: కేంద్రప్రభుత్వ ఉద్యోగుల(Central Government Employees)కు గుడ్ న్యూస్(Good News) లభించింది. డీఏ పెంపు(DA Increase)పై కేంద్ర కేబినెట్(Central Cabinet) కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ప్రధాని మోడీ(Pm Modi) అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్.. కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ పెంపుపై సుదీర్ఘంగా చర్చించింది. చివరికి ఇద్దరికి తీపికబురు అందించింది. 2 శాతం డీఏ పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పెంచిన 2 శాతం డీఏ త్వరలోనే కేంద్రప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షర్లకు అందనుంది. ఈ మేరకు ఇద్దరు ఉద్యోగులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో రోజులుగా డీఏ పెంపునకు ఎదురు చూస్తున్న తమకు కేంద్రప్రభుత్వం మంచి శుభవార్త వినిపించిందని ఆనందం వ్యక్తం చేశారు. తమ సమస్యలపై స్పందించి అండగా నిలిచిన మోడీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నామని కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, పెన్షర్లు పేర్కొన్నారు.






