ఆశావహులకు గుడ్ న్యూస్.. హెచ్1బీ వీసాల ప్రాసెసింగ్‌ పునరుద్ధరణ

by Kema Shiva Kumar |

అమెరికా (America)లో షట్‌డౌన్ కొనసాగుతోన్న వేళ ఇటీవల హెచ్‌1బీ (H 1B) వీసా ప్రాసెసింగ్‌ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిన విషయం వదితమే.

ఆశావహులకు గుడ్ న్యూస్.. హెచ్1బీ వీసాల ప్రాసెసింగ్‌ పునరుద్ధరణ
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా (America)లో షట్‌డౌన్ కొనసాగుతోన్న వేళ ఇటీవల హెచ్‌1బీ (H 1B) వీసా ప్రాసెసింగ్‌ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిన విషయం వదితమే. ఈ నేపథ్యంలోని అక్కడి కార్మిక శాఖ (Department Of Labors) కీలక ప్రకటన చేసింది. హెచ్1బీ వీసా ప్రాసెసింగ్ ప్రక్రియను పునరద్ధరిస్తున్నట్లుగా ప్రకటించింది. కాగా, అమెరికా కాంగ్రెస్‌ నిధులు విడుదల చేయకపోవడం వల్ల సెప్టెంబర్‌ 30 నుంచి ఫెడరల్‌ ప్రభుత్వ సేవలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి.

ఈ పరిణామంతో లేబర్‌ కండీషన్‌ అప్లికేషన్‌ (LCA), ప్రోగ్రామ్‌ ఎలక్ట్రానిక్‌ రివ్యూ మేనేజ్‌మెంట్‌ (PERM) దరఖాస్తులు ప్రాసెసింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా తాత్కాలిక, శాశ్వత ఉపాధి కార్యక్రమాల కోసం వీసా దరఖాస్తుల ప్రాసెస్‌ను విదేశీ కార్మిక ధ్రువీకరణ కార్యాలయం (OFLC) తిరిగి ప్రారంభించిందని కార్మిక శాఖ తెలిపింది. అమెరికన్ కంపెనీలు దరఖాస్తులు ప్రారంభించవచ్చని వెల్లడించింది. గ్రీన్‌ కార్డుకు సంబంధించి ప్రాసెస్‌‌ను కూడా ప్రారంభించామని అధికారులు వెల్లడించారు. అమెరికా కార్మిక శాఖ తాజా ప్రకటనతో భారతీయులకు కాస్త ఊరట లభించనుంది. ఎందుకంటే హెచ్‌-1బీ వీసా పొందేవాళ్లలో దాదాపు 70శాతం మంది ఇండియన్సే ఉడటం విశేషం

Next Story