- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gomutra: గోమూత్రంలో ఔషధ విలువలు.. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ కామకోటి వ్యాఖ్యలు
ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ కామకోటి గో మూత్రం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రశంసించారు. ఆవు మూత్రంలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయని తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ కామకోటి (Kamakoti) గో మూత్రం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రశంసించారు. ఆవు మూత్రంలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, జీర్ణవ్యవస్థ లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ‘జీర్ణ సంబంధిత వ్యాధుల వంటి పరిస్థితుల్లో ఆవు మూత్రం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎన్నో ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు. తీవ్ర జ్వరం వచ్చినప్పుడు గో మూత్రాన్ని సేవించిన ఓ సన్యాసి జీవితంలోని ఓ ఉదంతాన్ని వివరిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తీవ్ర జ్వరం వచ్చినప్పుడు ఆయన ఆవు మూత్రం తాగాడని, దీంతో సన్యాసి జబ్బు నయమైందని చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాతో వైరల్‌గా మారడంతో కాంగ్రెస్, డీఎంకే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ఈ కామెంట్స్‌ను కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం తీవ్రంగా ఖండించారు. కామకోటి వాదన నిరాధారమైందని, దానికి సైన్స్‌తో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఆయన సూడో సైన్సును ప్రచారం చేస్తు్న్నారని మండిపడ్డారు. దీంతో గోమూత్రం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై మరోసారి దేశ వ్యాప్తంగా చర్చ నీయాంశమైంది.






