- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహాకుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్‌గా ‘గోల్డెన్ బాబా’.. అసలెవరీ బాబా?
ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj) లో మహాకుంభ మేళా(Mahakumbha Mela) అంగరంగ వైభవంగా కొనసాగుతోంది.

దిశ,వెబ్‌డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj) లో మహాకుంభ మేళా(Mahakumbha Mela) అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో మహా కుంభమేళా లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో సాధువులు, సన్యాసులు ప్రయాగ్ రాజ్‌కు విచ్చేస్తున్నారు. IIT బాబా, కాంటేవాలా బాబా, రుద్రాక్ష బాబా ఇలా వెరైటీ బాబాలు భక్తులకు దర్శనమిస్తున్నారు. వీరిని చూసిన భక్తులు.. వారితో సెల్ఫీ తీసుకుంటు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కుంభమేళాలో గోల్డెన్ బాబా సందడి చేశారు. కేరళకు చెందిన ఈ బాబా ఒళ్లంతా బంగారమే. ఏకంగా ఆరు కిలోల బంగారు ఆభరణాలు(Gold ornaments) ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ గోల్డెన్ బాబా ఇప్పుడు కుంభమేళాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.
గోల్డెన్ బాబా(Golden Baba) అసలు పేరు మహా మండలేశ్వర్ నారాయణానంద్ గిరి మహరాజ్. నిరంజనీ అఖాడాకు చెందిన ఈ బాబా కేరళలోని సనాతన ధర్మ ఫౌండేషన్‌కు చైర్మన్(Chairman of the Foundation)గా సేవలందిస్తున్నారు. తన ఒంటిపై ధరించిన బంగారు ఆభరణాల గురించి పలువురు భక్తులు అడగడంతో ఆయన ఈ విధంగా స్పందించారు. గోల్డెన్ బాబా మాట్లాడుతూ.. వివిధ దేవతలకు గుర్తుగా ఈ నగలను గత 15 సంవత్సరాలుగా ధరిస్తున్నట్లు చెప్పారు. రుద్రాక్షలు, పగడాలు, రూబీలు, నీలమణులు, పచ్చలు పొదిగిన ఈ నగల నుంచి తనకు పాజిటివ్ ఎనర్జీ(Positive energy) వస్తుందని తెలిపారు. శ్రీ యంత్రంతో పాటు నగలను తాను చేసే పూజల్లోనూ వినియోగిస్తానని ఆయన వెల్లడించారు.






