- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మార్కెట్లో పసిడి రికార్డుల వేట.. భారీగా కుప్పకూలిన వెండి
దేశీయంగా తులం బంగారం ధర రూ.1,310 పెరిగి రూ.1,58,350 కి చేరింది. అయితే కిలో వెండి ధర మాత్రం ఒక్కరోజే రూ.15,000 తగ్గి రూ.2,85,000 కి పడిపోయింది.

దిశ, వెబ్ డెస్క్: అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, భారత్ లో దిగుమతి సుంకం భారీగా పెరగడంతో బంగారం రేట్లు పెరుగుతున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా ఈ రెట్లు పెరుగుతూ తగ్గుతూ వినియోగదారులను ఆయోమయంలోకి నెట్టేస్తున్నాయి. తాజాగా బుధవారం ఉదయం బంగారం ధరలు భారీగా పెరిగి మహిళకు షాక్ ఇవ్వగా.. వెండి మాత్రం ఒక్కరోజు 15 వేలు తగ్గి ఊరటనిచ్చింది. ఈ రోజు ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,310 పెరిగి రూ.1,58,350కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,200 పెరిగి రూ.1,45,150కి చేరింది.
ఒక్కరోజే రూ.15 వేలు తగ్గిన కిలో వెండి
బంగారం ధరలు కొండెక్కి కూర్చుంటే.. వెండి మాత్రం కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చింది. బుధవారం మార్కెట్లో వెండి ధర అనూహ్యంగా పతనమైంది. ఏకంగా ఒక్కరోజే కిలో వెండిపై రూ.15,000 తగ్గడం విశేషం. ఈ భారీ పతనంతో ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,85,000 కి పడిపోయింది. గ్లోబల్ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ బలోపేతం కావడం, ఇన్వెస్టర్లు వెండిలో లాభాల స్వీకరణకు (Profit Booking) మొగ్గు చూపడమే ఈ భారీ తగ్గుదలకు కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
డాలర్ దెబ్బకు రూపాయి విలవిల.. చరిత్రలోనే అత్యంత కనిష్ఠ స్థాయికి చేరువ






