- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూలిన బంగారు గని.. 11 మంది మృతి
తూర్పు సూడాన్‌లో ఓ బంగారు గని ఒక్కసారిగా కూలిపోవడం వల్ల విషాదకర ఘటన చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: తూర్పు సూడాన్‌లో ఓ బంగారు గని ఒక్కసారిగా కూలిపోవడం వల్ల విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 11 మంది యువ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. హౌయిడ్ అనే పట్టణంలో ఉన్న కెర్ష్ అల్-ఫీల్ బంగారు గనిలో శనివారం ఈ ప్రమాదం జరిగింది. తూర్పు నైలు ప్రావిన్స్ పరిధిలోని ఈ గనిలో ఘటనా స్థలాన్ని పరిశీలించిన సుడానీస్ మినరల్ రిసోర్సెస్ లిమిటెడ్ సంస్థ.. ఆదివారం అధికారికంగా ఈ వివరాలు వెల్లడించింది.
ప్రమాదంలో గాయపడిన మరో ఎనిమిది మంది కార్మికులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారని సంస్థ ప్రకటించింది. ఈ ఘటన నేపథ్యంలో గనిలో తవ్వకాలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు కూడా వెల్లడించారు. సూడాన్ బంగారం ఉత్పత్తిలో ప్రముఖ దేశమైనప్పటికీ.. గనుల్లో భద్రతా నియమాలు పాటించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఇందువల్ల అక్కడ పని చేసే కార్మికుల ప్రాణాలు ముప్పులో పడుతున్నాయి.






