Gold: ఆల్ టైమ్ హైకి బంగారం ధర..10 గ్రాముల వెల రూ.82,900కు చేరిక

by vinod kumar |
Gold: ఆల్ టైమ్ హైకి బంగారం ధర..10 గ్రాముల వెల రూ.82,900కు చేరిక
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగారం ధర (Gold price) మరోసారి గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆల్ ఇండియా బులియన్ అసోసియేషన్ ప్రకారం.. గురువారం దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.170 పెరిగి రూ. 82,900 సరికొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. అంతకుమందు రోజు ఇది రూ. 82,730గా ఉంది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.170 పెరిగి 10 గ్రాములకు రూ.82,500 వద్ద ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. గత ట్రేడింగ్ సెషన్‌లో 10 గ్రాముల ధర రూ.82,330 వద్ద ముగిసింది. అదే సమయంలో కిలో వెండి ధర రూ.500 తగ్గి రూ.90, 500కి చేరుకుంది. గ్లోబల్ మార్కెట్లలో సానుకూల ధోరణి, స్థానికంగా డిమాండ్ పెరగడం బంగారం ధరల నిరంతర పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు.

Advertisement

Next Story