Gold Atm: షాంగైలో గోల్డ్ ఏటీఎం.. ఫీచర్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

by B.Srinivas |

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా దేశం ఆవిష్కరణల్లో వేగంగా దూసుకెళ్తోంది. నూతన సాంకేతికతను ఉపయోగించుకుని అద్భుతాలు సృష్టిస్తోంది.

Gold Atm: షాంగైలో గోల్డ్ ఏటీఎం.. ఫీచర్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా దేశం ఆవిష్కరణల్లో వేగంగా దూసుకెళ్తోంది. నూతన సాంకేతికతను ఉపయోగించుకుని అద్భుతాలు సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే దేశంలోనే అతిపెద్ద నగరమైన షాంగైలోని ఓ షాపింగ్ మాల్‌లో గోల్డ్ ఏటీఎం (Gold Atm) ఏర్పాటు చేశారు. ఇది నగరంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి బంగారం ఏటీఎం. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధర పెరుగుతున్న కొద్దీ, ఈ చిన్న యంత్రం ప్రజలకు ఆకర్షణగా నిలుస్తోందని స్థానిక కథనాలు పేర్కొన్నాయి. ఈ ఏటీఎం వద్ద నిరంతరం జనసమూహం ఉంటుందని తెలిపాయి. ఏటీఎం స్పెషలైజేషన్ విషయాని కొస్తే ఇది 1200 డిగ్రీల సెల్సియస్ వద్ద బంగారాన్ని కరిగింది దాని స్వచ్ఛతను తెలియజేస్తుంది. అంతేగాక ప్రత్యక్ష ధరను సైతం చూపిస్తుంది. అలాగే బంగారం కొనుగోలు చేసిన తర్వాత బ్యాంకు నుంచి డబ్బును సైతం ట్రాన్స్ ఫర్ చేయొచ్చు. ఈ ఏటీఎం ఫీచర్స్ చూసి వినియోగదారులు ఎంతో ఆసక్తి కనబర్చుతున్నట్టు తెలుస్తోంది.

దీని నుంచి బంగారం లావాదేవీలు చేయడం కూడా చాలా సులభం. ముందుగా ఈ యంత్రం బంగారాన్ని తూకం వేస్తుంది. అనంతరం 99.99 శాతం గోల్డ్ స్వచ్ఛమైనదా కాదా అని తనిఖీ చేస్తుంది. ఆ తర్వాత షాంఘై గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రత్యక్ష రేటు ప్రకారం డబ్బును లెక్కిస్తుంది. ప్రస్తుతం ఈ గోల్డ్ ఏటీఎంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఎక్స్ లో ఓ వినియోగదారుడు దీనిపై స్పందిస్తూ.. వావ్ త్వరలో భారత్ లోనూ గోల్డ్ ఏటీఎంలను చూస్తామని ఆశిస్తున్నాం అని పేర్కొన్నారు. అలాగే మరొక నెటిజన్ సరదాగా వ్యాఖ్యానిస్తూ.. ఇది భారత్ కు వస్తే గొప్ప ఉత్పత్తి అవుతుంది, కానీ చైన్ స్నాచర్లకు సైతం సంతోషం కలుగుతుందని సెటైర్ వేశారు.

Next Story