- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Godavari : గోదావరి ఉధృతి.. నాసిక్ లో పలు ఆలయాలు నీట మునక
మహారాష్ట్ర(Maharashtra)లో గోదావరి(Godavari) నది వరద(Floods) ప్రవాహం భారీగా పెరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర(Maharashtra)లో గోదావరి(Godavari) నది వరద(Floods) ప్రవాహం భారీగా పెరిగింది. నాసిక్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. ఫలితంగా రామకుండ్, గోదా ఘాట్ ప్రాంతాల్లోని చిన్న ఆలయాలు, వంతెనలు పూర్తిగా నీటమునిగాయి. గంగాపూర్ డ్యామ్ నుంచి 5,186 క్యూసెక్స్ నీరు గోదావరి నదిలోకి విడుదల చేయడంతో నాసిక్‌లోని రామకుండ్ పరిసరాల్లో వరద ఉద్ధృతి తీవ్రంగా పెరగడంతో సైఖేడ, చందోరి గ్రామాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
నాసిక్‌తో పాటు పుణె, పాల్ఘర్, సతారాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇండియన్ మెటీరియాలాజికల్ డిపార్ట్‌మెంట్(IMD) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నదీ తీరాల్లో నివసించే ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాలను ఖాళీ చేయాలని అధికారులు సూచించారు.






