గోవా నైట్ క్లబ్ ప్రమాదంపై ఎట్టకేలకు స్పందించిన యాజమాన్యం

by Malleboina Mahesh |

గోవాలోని బిర్చ్ (Birch) వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన దురదృష్టకర సంఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

గోవా నైట్ క్లబ్ ప్రమాదంపై ఎట్టకేలకు స్పందించిన యాజమాన్యం
X

దిశ, వెబ్ డెస్క్: గోవాలోని బిర్చ్ (Birch) వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన దురదృష్టకర సంఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. 25 మంది ప్రాణాలను బలిగొన్న అగ్నిప్రమాదానికి కారణమైన గోవా నైట్‌క్లబ్ (Goa Nightclub) ఉద్యోగిని ఢిల్లీలో రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే ఈ ప్రమాదంపై ప్రాణ నష్టం సంభవించడం పట్ల యాజమాన్యం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ విషాదకర ఘటన తమను తీవ్రంగా కలచివేసిందని యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ తీర్చలేని విషాదం, అపారమైన ఆవేదన సమయంలో, మరణించిన వారి కుటుంబాలకు, అలాగే గాయపడిన వారికి తాము గట్టిగా అండగా ఉంటామని పేర్కొంది. యాజమాన్యం తమ హృదయపూర్వక సంతాపాలను అత్యంత చిత్తశుద్ధితో తెలియజేస్తూ.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్టు చేసింది.

Next Story