Pramod Sawant: గోవా యోగ భూమి.. గోమాత భూమి

by Shamantha N |

సంస్కృతి సంప్రదాయాల వల్లే తమ రాష్ట్రం పర్యాటకులను ఆకర్షిస్తుందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అన్నారు. సనాతన్ సంస్థ వ్యవస్థాపకుడు జయంత్ అథవాలే 83వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన 'సనాతన రాష్ట్ర శంఖనాద్ మహోత్సవ్' ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు.

Pramod Sawant: గోవా యోగ భూమి.. గోమాత భూమి
X

దిశ, నేషనల్ బ్యూరో: సంస్కృతి సంప్రదాయాల వల్లే తమ రాష్ట్రం పర్యాటకులను ఆకర్షిస్తుందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అన్నారు. సనాతన్ సంస్థ వ్యవస్థాపకుడు జయంత్ అథవాలే 83వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన 'సనాతన రాష్ట్ర శంఖనాద్ మహోత్సవ్' ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. గోవా "భోగ్ భూమి" (ఆనంద భూమి) కాదని.. "యోగ భూమి", "గో-మాత భూమి" అని అన్నారు. సన్, సాండ్, సీ(సూర్యుడు, ఇసుక, సముద్రం) కంటే ఇక్కడి దేవాలయాలు, సంస్కృతి చూసేందుకు ఎక్కువమంది పర్యాటకులు వస్తున్నారని అన్నారు. సనాతన సంస్థ ఆశ్రమం కూడా ఇక్కడ ఉందని చెప్పుకొచ్చారు. విష్ణువు అవతారమైన పరశురాముడు అరేబియా సముద్రంలోకి బాణం వేసి గోవాను వెనక్కి నెట్టివేశారని పురాణాన్ని ప్రస్తావించారు."ఇది పరశురాముడి భూమి" అని చెప్పుకొచ్చారు.

బీచ్ ల కంటే దేవాలయాలకే ఎక్కువ మంది..

గోవాలోని పరిశుభ్రమైన, అందమైన దేవాలయాలు.. బీచ్‌ల కంటే ఎక్కువ మందిని ఆకర్షిస్తున్నాయని సావంత్ అన్నారు. గోవాలోని దేవాలయాలను ప్రభుత్వం నిర్వహించదన్నారు. శతాబ్దాల నాటి ఆచారాలను సమర్థించిన స్థానిక సమాజాలు నిర్వహిస్తాయని ఆయన పేర్కొన్నారు. "రాష్ట్రంలోని దేవాలయాల నిర్వహణలో ప్రభుత్వానికి ఎటువంటి ప్రమేయం లేదు" అని చెప్పుకొచ్చారు. ఉత్తర గోవాలోని రామనాథి గ్రామంలో ఉన్నప్రజలకు ఆధ్యాత్మిక అవగాహన కల్పించి, సనాతన ధర్మం గురించి ప్రజలకు మరింత బోధించినందుకు ఆయన ప్రశంసలు కురిపించారు.

Next Story