- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోవాలో న్యూసెన్స్ చేస్తే మీ జేబుకి చిల్లే.. ఆ బిల్లుకు ప్రభుత్వం ఆమోదం
పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి గాంచిన గోవాలో.. ఇకపై ఇబ్బందులు కలిగించే వారితోపాటు అనధికారిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది.

దిశ, వెబ్‌డెస్క్: "బోర్ కొడుతోంది.. ఛిల్ అయ్యేందుకు ఏదైనా టూరిస్ట్ ప్లేస్‌కి వెళ్దాంరా" అని ఫ్రెండ్స్‌లో ఎవరైనా అనగానే ఠక్కున గుర్తొచ్చే మోస్ట్ విజిటెడ్ ప్లెసెస్ లిస్టులో గోవా టాప్‌లో ఉంటుంది. పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి గాంచిన గోవాలో.. ఇకపై ఇబ్బందులు కలిగించే వారితోపాటు అనధికారిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. తాజాగా.. గోవా టూరిస్ట్ ప్లేసెస్ సవరణ బిల్లు 2025 (ప్రొటెక్షన్ అండ్ మెయింటెనెన్స్)ను ఆ రాష్ట్ర సర్కార్ ఆమోదించింది. దీని ప్రకారం ఇకపై గోవాలో పర్యాటక ప్రాంతాల్లో ఎవరైనా న్యూసెన్స్ చేస్తే రూ.లక్ష వరకూ జరిమానా విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
కాలుష్యానికి, ప్రమాదాలకు కారణమయ్యే వస్తువులతో పాటు.. నీటిపై తేలియాడే వస్తువుల్ని అమ్మడం, వాటిని కొనాలని పర్యాటకుల్ని ఇబ్బంది పెట్టడం, పర్మిషన్ లేని ప్రాంతాల్లో ఆల్కహాల్ తీసుకోవడం, గ్లాసులు పగలగొట్టడం, పబ్లిక్ ప్లేసుల్లో వంట చేయడం, చెత్తవేయడం, వాటర్ స్పోర్ట్స్ నిర్వహణ, అనధికారికంగా టికెట్లు, వస్తువులు అమ్మడం, భిక్షాటన తదితర పనులన్నీ న్యూసెన్స్ కిందికే వస్తాయని కొత్త చట్టంలో పేర్కొంది. సవరించిన సెక్షన్ 10 ప్రకారం.. గోవాలో నిబంధనల్ని ఉల్లంఘిస్తే కనిష్ఠంగా రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు అధికారులు జరిమానా విధించనున్నారు. సంబంధిత అధికారుల సిఫార్సుల మేరకు ప్రతి రెండేళ్లకోసారి వీటిని 10 శాతం మేర పెంచే అవకాశం కూడా ఉందని గోవా పర్యాటక శాఖ మంత్రి రోహన్ ఖౌంటే తెలిపారు. ఇటీవల కాలంలో గోవా పర్యాటక ప్రదేశాల్లో ఏజెంట్లు పెరిగిపోయారని.. ఈ క్రమంలో ఈ బిల్లు ఓ ముందడుగు అని ఆయన అభిప్రాయపడ్డారు.






