- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video : గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్.. భోజనం ప్లేట్ల కోసం తన్నులాట
భోపాల్(Bhopal) లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్(Global Investors Summit) లో భోజనం ప్లేట్ల కోసం(Fight for Plates) తన్నుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : భోపాల్(Bhopal) లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్(Global Investors Summit) లో భోజనం ప్లేట్ల కోసం(Fight for Plates) తన్నుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్(MP) రాజధాని భోపాల్ లో గత రెండు రోజులుగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది. దీనికి ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి పెద్దఎత్తున ఇన్వెస్టర్స్ హాజరయ్యారు. దాదాపు రూ. 26.61 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పొందింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఈ సమ్మిట్ లో ఏర్పాట్లు మాత్రం అంత్యంత మాత్రంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సమ్మిట్ కోసం వచ్చిన వారికి సరైన భోజన వసతి కల్పించక పోవడంతో.. పెద్ద ఎత్తున హాజరైన అతిథులు భోజనం ప్లేట్ల కోసం ఒకరిని ఒకరు తోసుకున్నారు. ఒకానొక దశలో ప్లేట్ల కోసం తన్నుకోవడంతో ప్లేట్లు కిందపడి విరిగి పోయాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుండగా.. ప్రపంచస్థాయి సదస్సులో ఈ ఏర్పాట్లు ఏమిటని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించారు.






